పవన్ సినిమాకి జగన్ బ్రేకులు?

పవన్ కల్యాణ్ నెక్స్ట్ సినిమాకి జగన్ కారణంగా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ దాసరి నిర్మాణం లో ఒక సినిమా చేయాల్సి ఉంది. స్వయంగా పవన్ కల్యాణే దాసరి నిర్మాత సినిమా  చేస్తానని అడిగారని టాక్. దాసరి నిర్మించే చిత్రానికి దర్శకుడు ఎవరు అన్న టాక్ నడుస్తుండగానే, వైకాపా నేత జగన్ వెళ్లి దాసరి తో భేటీ అయ్యారు. జగన్ అంటే విపరీతమైన వ్యతిరేకత ఉండటం వల్లే, గత ఎన్నికల్లో పవన్ టిడిపి కి సపోర్ట్ చేసారు. ఇప్పుడు  కనుక దాసరి వైకాపా లో చేరితే, పవన్ దాసరి కి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.  ప్రత్యర్థి పార్టీలో ఉన్న నాయకుడి కి పవన్ సహాయం చేస్తాడా అంటే డౌటే. లేదు సినిమా సినిమా నే, రాజకీయం రాజకీయమే, దేనికదే అని పవన్ దాసరి సినిమా చేస్తారా వేచి చూడాలి. జగన్ స్వయంగా తన ఇంటికి వచ్చి కలవడంతో భోళా శంకరుడు అయిన దాసరి, ఏదో మాట వరసకి జగన్ కి మద్దతు ప్రకటించారా లేక నిజంగా వైకాపా లో చేరతారా అనేది ఇంకూడి రోజుల్లో తెలుస్తుంది, అప్పుడే పవన్ సినిమా పై క్లారిటీ వస్తుంది.
Previous
Next Post »