సీనియర్ యాంకర్ – ఎక్స్ ఎంపీ ల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్


అందాలను ఆరబోసి బోయనట్లు ఒలకబోస్తే.. వాక్చాతుర్యంతో జనాల బిపి రైజ్ చేసి.. మెస్మరైజ్ చేయగలిగితే యాంకర్‌ గా బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిపోవచ్చు. అలాగే పబ్లిక్ ఫంక్షన్లలో కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌ గా నిలిచి అందినంత దండుకోవచ్చు. కాలంతో, కాల్‌ షీట్లతో సంబంధం లేకుండా సెలబ్రటీగా హోదా కొట్టేయచ్చు.

దాదాపు బుల్లితెర పుట్టినపుడు పుట్టి స్టార్ యాంకర్ గా పేరుతెచ్చుకున్న ఓ సీనియర్ యాంకర్, గోదావరి జిల్లాలకి చెందిన ఒక ఎక్స్ ఎంపీ తో సహజీవనం చేస్తోందనే వార్త ఇప్పుడు ఆ జిల్లాల్లో హల్ చల్‌ చేస్తోంది. ఇప్పుడు టీవీ-షో ల కన్నా ఈవెంట్స్ లో హోస్ట్ గా ఎక్కువ కనిపిస్తున్నఈ సీనియర్ యాంకర్ కనుచూపు మేరలో భవితవ్యం కానరాని ఆ ఎక్స్ ఎంపితో చనువుగా తిరుగుతోందని గుసగుసలు వినపడుతున్నాయి.. కళాపోషణతో పాటు సామాజిక చైతన్యం కూడా ఉన్న ఈ సీనియర్ యాంకర్ కి గతంలో ఓ స్టార్ హీరోతో ఎఫైర్ ఉందని పుకార్లు నడిచాయి.  అవన్నీ ప్రొఫెషనల్ జెలసీతో కాంపిటీటర్స్ పుట్టించినవే అని ఆ యాంకర్ కొట్టిపారేసింది. అంతేకాదు “జనంకోసం మనం – మన కోసం జనం, ఈ పుకార్లు చాలా సర్వ సాధారణం” అంటూ సరికొత్త సత్యాన్ని సమాజానికి పరిచయం చేసింది.

ఇప్పటికీ ఫామ్ లో ఉన్న ఆ సీనియర్ యాంకర్ కి, ఈ ఎక్స్ ఎంపి ఎక్కడ దొరికాడ్రా బాబూ అని టాలివుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు.
Previous
Next Post »