రోహిత్ వేముల మరీ అంత అమాయకుడేం కాదు! అతడికి హిందూ మతం అంటే కసి, ద్వేషం.

ప్రజలకు వార్తలను చేరవేసే మీడియా ప్రతీ విషయంలో తప్పొప్పులు జాగ్రత్తగా గమనించి.. ఆలోచించి.. నిర్థారించుకోవాలి. దురదృష్టవశాత్తూ ఇలా, జాగ్రత్తగా ఆలోచించడం.. పరిశోధన చేయడం మన దేశ మీడియాకు ఏ కోశానా లేదు. ఇంకా, చెప్పాలంటే.. గొర్రెల మందలో.. ఒక గొర్రె ఎటు వైపు వెళితే మిగతా గొర్రెలు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆ గొర్రెను ఫాలో అయిపోతాయి. మన దేశంలో మీడియా గొర్రెల మంద లాంటిదే! ఒక ఛానల్ లేదా మీడియా ఏదైతే రిపోర్ట్ చేస్తుందో లేదా స్టాండ్ తీసుకుంటుందో.. అదే స్టాండ్‌ను మిగతా వారు ఏమాత్రం ఆలోచించకుండా జస్ట్ ‘కాపీ పేస్ట్‌’ చేసి ఫాలో అయిపోతారు. హైదరాబాద్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వెముల విషయంలో కూడా మీడియా బాధ్యతా రహితంగా ప్రవర్తించింది. ఈ సంఘటన గురించి మనం కాస్త వివరంగా మాట్లాడుకుందాం..

వాస్తవానికి ఈ వివాదానికి గత జూలైలోనే నాంది పడింది. జూలై 30న ఉగ్రవాది యాకుబ్ మెమెన్‌ను ఉరి తీయడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో అంబేద్కర్ స్టూడెంట్స్ ఆసోసియేషన్ నేతలు యూనివర్సిటిలో ర్యాలీలు, సంతాప సభలు, సెమినార్లు నిర్వహించారు. వీటిల్లో చురుగ్గా పాల్గొన్నాడు రోహిత్ వేముల. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ముంబై పేలుళ్లకు సూత్రధారి.. వందలాది మంది భారతీయుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న  టెర్రరిస్ట్ ను,  హంతకుడిని ఉరి తీయడం న్యాయం కాదంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ విద్యార్థులు ఆందోళన చేయడం ఎంత వరకు సమర్థనీయం. అంటే దేశం కంటే వీళ్లకు ఆ ఉగ్రవాది యాకుబ్ మెమనే ఎక్కువనమాట! దీనికి ప్రతిగా ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌ కుమార్ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ క్రమంలోనే, ఇటు ఏబీవీపీకి, ఇటు అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోషియేషన్ మధ్య యాకుబ్ మెమన్ ఉరిపై వాదోపవాదాలు సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగాయి. దీంతో, ఆగస్టు 3వ తేదీ అర్థరాత్రి సుశీల్ గదికి వెళ్లి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ దాడి కారణంగా, పేగులు దెబ్బతినడంతో ఆతడు మదీనాగూడలోని అక్షర ఆసుపత్రిలో సుమారు 8 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే, దాడికి కారుకలైన విద్యార్థులపై చర్యలు చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దీంతో దాడికి కారకులుగా గుర్తించిన ఐదుగురు విద్యార్థులను యూనివర్సిటీ హాస్టల్‌ నుంచి బహిష్కరించింది.

ఇలా, బహిష్కారానికి గురైన విద్యార్థులో ఒకడు రోహిత్‌ వేముల. అనంతరం ఈ విషయం కోర్టు వరకూ వెళ్లింది. ఈ అంశంపై యూనివర్శిటీ తీసుకున్న చర్యలపై న్యాయస్థానం నివేదిక కోరింది. ఇందులో భాగంగానే, అప్పటి వీసీ ఆర్పీ శర్మ క్రమశిక్షణ కమిటీ వేశారు. ఈ కమిటీ విచారణ చేసి దాడికి పాల్పడ్డ ఐదుగురు విద్యార్థులను ఒక సెమిస్టర్ వరకు హాస్టల్ నుంచి తప్పించాలని సూచించింది. అనంతరం ఇదే విషయంపై యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్ కూడా విచారణ జరిపి ఈ ఐదుగురు విద్యార్థులకు యూనివర్సిటీలో తమ రీసెర్చిని యథాతధంగా చేసుకోవచ్చని.. అయితే పీహెచ్ డీ పూర్తయ్యే వరకు హాస్టల్ సౌకర్యం రద్దు చేయడంతో పాటు, ఎన్నికల్లో ఓటు వేయకూడదని.. ఎవరితోను మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే,  తదనంతర పరిణామాల్లో పూర్తిస్థాయి సస్పెన్షన్ గురిచేస్తే విద్యార్థులు కెరీర్ దెబ్బతింటుందని భావించి, కాస్త గొడవలు సద్దుమణిగే వరకు  అంటే కేవలం ఆరు నెలల పాటు హాస్టల్‌ దూరంగా ఉండాలని.. ఈ ఐదుగురు విద్యార్థులు యథాతధంగా యూనిర్శిటీలో తన విద్యను కొనసాగించుకోవచ్చని ఆదేశిస్తూ కొన్ని నెలల క్రితం పాక్షిక సస్పెన్షన్ ను విధించింది.

అంటే.. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది.. కేవలం ఆరునెలల పాటు ఈ ఐదుగురు విద్యార్థులను కేవలం హాస్టల్‌ నుండి మాత్రమే సస్పెండ్ చేశారు. అయితే, ఈ పాక్షిక బహిష్కరణకు నిరసనగా గత 14 రోజుల పాటు పీహెచ్‌డీకి చెందిన మరో నలుగురు విద్యార్థులు ‘వెలివాడ’ అనే పేరు పెట్టి టెంట్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుకున్నారు. మరో వైపు, తన కుమారుడిపై జరిగిన దాడిపై సుశీల్ కుమార్ తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో న్యాయస్థానం తీర్పును త్వరలో ఇవ్వనుంది. ఇక, ఈ స్టోరీలో బండారు దత్తాత్రేయ రోల్
ఏమిటంటే.. యాకుబ్ మెమ్‌న్‌ ఉరి తీయడాన్ని సమర్థిస్తూ మాట్లాడినందుకు సెంట్రల్ యూనివర్సిటీలోని అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్‌ విద్యార్థులు సుశీల్ కుమార్ అనే ఏబీవీపీ నాయకుడిపై దాడి చేశారని.. యూనివర్సిటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ పెరిగిపోతున్నాయని.. కాబట్టి ఈ విషయంపై దృష్టి పెట్టాలని ఆయన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కోరారు. ఇలా లెటర్ రాయడమే ఘనత వహించిన సూడో సెక్యులర్‌ మీడియా దృష్టిలో బండారు దత్తాత్రేయ చేసిన పెద్ద తప్పు!

సో.. మొత్తం సంఘటనను ఓసారి విశ్లేషించుకుందాం..

1. అసలు పాకిస్థాన్ సహాయంతో దేశంలోని ముంబైలో ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించి.. వందలాది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న యాకుబ్‌ మెమెన్‌ ఉరి తీయడాన్ని వ్యతిరేకించడం ఘోరాతి ఘోరమైన తప్పు! అంటే.. ఈ సోకాల్ట్‌ రోహిత్ వేముల లాంటి అంబేద్కర్ స్టూడెంట్స్  అసోషియేషన్ లీడర్లకి దేశం కంటే యాకుబ్ మెమెనే ఎక్కువనమాట! అసలు దేశం కంటే.. దేశాన్ని నాశనం చేస్తున్న ఉగ్రవాదులని, విచ్ఛిన్నకర శక్తులకి మద్దుతు గా, అండగా మాట్లాడుతున్న  వీరి తీరు చూసి పైనున్న ఆ అంబేద్కర్ మహానుభావుడి ఆత్మ కూడా క్షోభించకమానదు!

2. ఇక, సెకండ్ పాయింట్, జరిగిన గొడవపై యూనివర్శిటీ యాజమాన్యం కేవలం ఆరు నెలల పాటు రోహిత్ వేములను యూనివర్సిటీ హాస్టల్‌ నుంచి మాత్రమే బహిష్కరించింది. అదీ కూడా కాస్త గొడవలు సద్దుమణిగే వరకు! రోహిత్ వేములను కేవలం హాస్టల్ నుంచి మాత్రమే బహిష్కరించామని.. అయితే, అతడు యథావిధిగా తన పీహెచ్‌డీ ఎటువంటి అవాంతరాలు లేకుండా చేసుకోవచ్చని యూనివర్సిటీ ప్రకటించింది.  కేవలం ఆరు నెలల పాటు హాస్టల్ నుంచి పంపించేసినందుకు రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటో ఎవరికీ అర్థం కాని విషయం!

3. ఇక మూడో  పాయింట్‌.. చాలా మంది రాజకీయాలు దీన్ని దళితులకి జరిగిన అన్యాయంగా మతం రంగు పులిమేందుకు చూస్తున్నారు. ఇది కేవలం యాకుబ్ మెమెన్‌ ఉరికి సంబంధించిన విషయంలో ప్రారంభమైన గొడవ మాత్రమే! పై సంఘటనలో ఏబీవీపీ విద్యార్థులు ‘దళితుడిగా’ చెప్పబడుతున్న రోహిత్‌ను కులం పేరుతో ఎక్కడ అవమానించలేదు. కానీ, ఎక్కడా కులసంబంధమైన వివాదం లేకపోయినప్పటికీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌ మీద  ‘ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ’ కేసు పెట్టడం దారుణం! అత్యంత దారుణంగా, యూనివర్సిటీలో పరిస్థితులు చేజారిపోతున్నాయని ఓ ఉత్తరం రాయడమే బండారు దత్తాత్రేయ చేసిన తప్పా? ఇంతకీ ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. రోహిత్ దళిత విద్యార్థి కాదని.. అతడు బీసీ కులమైన వడ్డెర కులానికి చెందిన వాడని తెలుస్తోంది.. అతడి అసలు పేరు రాజచైతన్య కుమార్‌ అట! కానీ, ఘనత వహించిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు.. సూడో సెక్కులర్ మీడియాతో పాటు రాహుల్ గాంధీలు, కేజ్రీవాల్‌ లాంటి నాయకులు ఈ విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో  ఓ పథకం ప్రకారం రోహిత్‌ వేములను దళిత్‌గా ప్రాజెక్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రోహిత్ తండ్రి, తన కుమారుడి జనన నమోదు కోసం చేసిన దరఖాస్తు లో తమది వడ్డెర కులం అని రాసారు.  అలాగే కులం గురించి రోహిత్ నాయనమ్మ చెప్పిన వీడియో క్లిప్‌ని ఈ క్రింద చూడండి! (రోహిత్ కులం గురించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.)

ROHITH CASTE
4. ఇక, నాలుగో పాయింట్ ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేమలు ఏమంత అమాయకుడు కాదు! అతడికి మత సహనం ఏమాత్రం లేదు. రోహిత్ వేములకి హిందూ మతమంటే ద్వేషం. కరెక్ట్‌గా చెప్పాలంటే.. అతడు ఓ పర్‌వెర్షనిస్ట్‌! కొన్నాళ్ల క్రితం యూనివర్సిటీలో ఏబీవీపీ బ్యానర్లని చింపేస్తుండగా.. అకారణంగా తమ బ్యానర్లు ఎందుకు చించేస్తున్నావని ఏబీవీపీ విద్యార్థులు ప్రశ్నించారు. దీనికి రోహిత్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. తనకు హిందూ మతమంటే ద్వేషమని.. కాషాయం రంగు ఎక్కడా కనిపించినా చింపేస్తానని హిందుత్వంపై తనకున్న అక్కసును ఎలా వెళ్లగక్కాడో ఈ క్రింద వీడియోలో చూడండి! పై సంఘటనలో అవతల వర్గం వారిని రెచ్చగొట్టడానికి రోహిత్ బ్యానర్లు చింపడం అతడి విపరీత ప్రవర్తనకు నిదర్శనం! అసలు, హిందూ మతంలో పట్టి.. హిందూ మతమంటే రోహిత్ వేముల కు ఇంత ద్వేషం ఎందుకని ఆరా తీయగా.. చాన్నాళ్ల క్రితం ముస్లిం మతంలోకి మారిన అతడి అన్నయ్య ప్రభావం రోహిత్ మీద చాలా ఉందని.. యాకుబ్ మెమెన్ మీద అతడి ‘ప్రేమ’ కు అదే కారణమని హైదరబాద్‌ యూనివర్శిటీ విద్యార్థులు కొందరు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.



5. ఇక, ఐదో పాయింట్‌.. యూనివర్సిటీల కోసం ఏటా అనేక వందల కోట్లు ప్రజల నుంచి సేకరించిన పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బులను ప్రభుత్వాల ఖర్చు పెట్టేది.. దేశంలోని విద్యార్థుల మీద నమ్మకంతో.. భవిష్యత్తులో నవ భారతావని నిర్మించేది ఈ విద్యార్థులేనన్న ఆశతో! అలాంటి విద్యార్థులు దేశం కోసం కాకుండా దేశానికి ద్రోహం చేసిన యాకుబ్ మెమెన్ లాంటి నరహంతుడి కోసం ఏమాత్రం సిగ్గులేకుండా కన్నీళ్లు కారుస్తూ నానారచ్చ చేయడం ఎంతవరకు సమర్థనీయం! ఇలాంటి విపరీత బుధ్దితో ప్రవర్తిస్తున్న రోహిత్ వేముల లాంటి విద్యార్థులు అసలు ఈ దేశంలోనే పుట్టారా లేక పాకిస్థాన్ లో పుట్టి ఈ దేశానికి ఎక్స్ పోర్ట్ అయ్యారా అనే అనుమానం ఎవరికైనా రాకమానదు!
Newest
Previous
Next Post »